న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కునే వ్యూహంలో భాగంగా అన్ని పథకాల్లో పేదలకే ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi ) చెప్పారు. ఇవాళ మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం అయినా, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన పథకం అయినా మొదటి రోజు నుంచి తాము పేదల ఆహారం, ఉపాధి గురించే ఆలోచిస్తున్నామని చెప్పారు.
దేశంలో 80 కోట్ల మందికిపైగా జనాభా ఉచితంగా రేషన్ పొందుతున్నారని ప్రధాని తెలిపారు. కేవలం బియ్యం, గోధుమలు, పప్పులు మాత్రమే కాదని.. దాదాపు 8 కోట్లకుపైగా మందికి లాక్డౌన్ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పారు. అదేవిధంగా 20 కోట్ల మందికిపైగా మహిళల జన్‌ధన్ ఖాతాల్లో 30,000 కోట్ల రూపాయలను జమచేశామన్నారు. అదేవిధంగా ఇటీవల మధ్యప్రదేశ్‌లో కురిసిన వర్షాలు, వరదలపై కూడా ప్రధాని మాట్లాడారు.
రాష్ట్రంలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అతని టీమ్ సమర్థంగా ఎదుర్కొన్నారని ప్రధాని కొనియాడారు. ఈ వరదల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం, పలువురు ఆవాసాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్‌లో రోడ్లు అధ్వాన్నంగా ఉండేవని, రోడ్ల కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసేవాళ్లని ప్రధాని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారుల రూపురేఖలు మారిపోయాయన్నారు.
Prime Minister Narendra Modi interacts with beneficiaries of Pradhan Mantri Garib Kalyan Anna Yojana in Madhya Pradesh, via video conferencing. pic.twitter.com/CYPQJrraEe
— ANI (@ANI) August 7, 2021
ఇవి కూడా చదవండి
Photoshoot : ఫోజుకు సిగ్గుపడి వరుడిని కొలనులోకి తోసిన వధువు.. వైరల్ వీడియో
Bumper offer : బైకు కొంటే హెల్మెట్ ఫ్రీ.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా..!
Chief Justice : దర్యాప్తు సంస్థల తీరుపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు..!
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!