గురుగ్రామ్: ద్వారక ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. 19 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ఎన్‌హెచ్-48పై ట్రాఫిక్ రాకపోకలు సులువవుతాయి.
అదే సమయంలో దేశ రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందుతాయని మోదీ చెప్పారు. దీనితోపాటు 112 జాతీయ హైవే ప్రాజెక్టులను ప్రారంభించడం దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఓ మైలురాయి అని తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేల వల్ల గ్రామీణ భారతానికి సరికొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు.
ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 29 కిలోమీటర్లు, దీనిలో 18.9 కిలోమీటర్లు హర్యానా సెక్షన్‌లోనూ, మిగిలిన 10.1 కిలోమీటర్లు ఢిల్లీలోనూ ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి 2019 మార్చి 9న అప్పటి కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.