PM Modi | గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad Plane Crash)లో నిన్న ఎయిర్ ఇండియా (Air india) విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ అహ్మదాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఘటనాస్థలిని పరిశీలించి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని సమీక్ష నిర్వహించారు.
#WATCH | Prime Minister Narendra Modi holds a review meeting with the officials at the airport in Ahmedabad in the wake of yesterday’s #AirIndiaPlaneCrash.
(Source – DD) pic.twitter.com/V9M0B5RDsb
— ANI (@ANI) June 13, 2025
విమాన ప్రమాదంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద తీరు, అనంతరం జరిగిన పరిణామాలు, సహాయక చర్యలు వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు. సమీక్ష అనంతరం విజయ్ రూపానీ (Vijay Rupani) కుటుంబాన్ని ప్రధాని పరామర్శించనున్నారు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూపానీ కుటుంబాన్ని, ఆయన భార్య అంజలి రూపానీని ప్రధాని మోదీ పరామర్శించనున్నారు.
అంతకుముందు విమాన ప్రమాద స్థలిని ప్రధాని పరిశీలించారు. ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి (Ahmedabad Civil Hospital)కి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచిన బ్రిటిష్ జాతీయుడైన (British national ) 38 ఏండ్ల రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh)ని మోదీ పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద తీరును ప్రధానికి రమేశ్ వివరించారు.
Also Read..
PM Modi | అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ
PM Modi | విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ.. క్షతగాత్రులకు పరామర్శ
Air India | ముంబై టు లండన్.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం