PM Modi : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 100వ రాకెట్ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అంతరిక్ష రంగం (Space Sector) లో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రోకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని.. ఇస్రో, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చించారు.
గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమని ప్రధాని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్‌ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గిరిజన భాషలను పరిరక్షించడంలో ఆయన సాయం చేశారంటూ కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కొలామి భాషలో కైలాష్ పాటను కంపోజ్ చేశారని ప్రధాని మోదీ అన్నారు.