న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటన రద్దయింది. ఆయన ఈ నెల 13 నుంచి 17 వరకు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌లో పర్యటించవలసి ఉంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటన రద్దయింది. ఆయా దేశాలకు ఈ సమాచారాన్ని అధికారులు తెలియజేశారు.