ఆదివారం 17 జనవరి 2021
National - Nov 28, 2020 , 22:34:18

30న వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

30న వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

ఉత్తరప్రదేశ్‌ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. హండియా( ప్రయాగ్‌ రాజ్‌)- రాజతలాబ్‌ (వారణాసి) మధ్య పూర్తయిన ఆరులేన్ల జాతీయ రహదారి-19ని ఆయన జాతికి అంకితం చేయన్నారు. అనంతరం ఆయన దేవ్‌ దీపావళి వేడుకల్లో పాల్గొని కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ కారిడార్‌ ప్రాంతంతోపాటు సారనాథ్‌ పురావస్తుశాఖ మ్యూజియంను సందర్శించున్నట్లు శనివారం ప్రధాని కార్యాలయం తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.