న్యూఢిల్లీ, జూన్ 29: ప్రధాని మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం ఏర్పడిందని సీపీఎం విమర్శించింది. ఈ పర్యటన వల్ల స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత విదేశీ విధానంలాగా మారిపోయిందని తమ పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీ సంపాదకీయంలో దుయ్యబట్టింది.
మోదీ అమెరికా అనుకూల విధానాల వల్ల బహుళ ధ్రువ ప్రపంచంలో స్వతంత్ర పాత్రను పోషించే గొప్ప అవకాశాన్ని భారత్ కోల్పోయిందని అభిప్రాయపడింది.