బెంగళూరు, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దాదాపు 40 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న మణికంఠ రాథోడ్‌ను గెలిపించాలని ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. మే 6న మణికంఠ పోటీచేస్తున్న చిత్తాపుర నియోజకవర్గానికి మోదీ రానున్నారని, రావుర గ్రామంలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు.
ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీచేస్తుండంతో బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నది. రాథోడ్‌పై కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి.