PM Modi: అమెరికా, ఇరాన్ మధ్య డీల్‌ను స్వాగతించిన ప్రధాని మోదీ
PM Modi: పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ డీల్‌ను అమలు చేయడం వల్ల పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో మోదీ రియాక్ట్ అయ్యారు.
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడనున్న విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మోదీ(PM Modi) స్పందించారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ డీల్ అమలు వల్ల పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో మళ్లీ స్థిరత్వం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఒప్పందం కుదరని అంశాలపై కూడా సమగ్రమైన అగ్రిమెంట్ జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన ఎక్స్ అకౌంట్లో ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సమస్యలు ఉత్పన్నమైనట్లు వెల్లడించారు. అనేక దేశాల్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు చెప్పారు. నిరంతర చర్చల ప్రక్రియ ద్వారా వాషింగ్టన్, టెహ్రాన్ తమ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
శాంతి ఒప్పందంపై ఓ అవగాహనకు వచ్చినట్లు అమెరికా, ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జూన్ 19వ తేదీన ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు జరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ నిరంతరం ఫోకస్ పెట్టింది. ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో.. భారత ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని రోజుల క్రితం వైమానిక దాడిలో భారతీయ నౌకకు చెందిన ముగ్గురు సిబ్బంది కూడా మృతిచెందారు. ఆ ఘటన నేపథ్యంలో అమెరికా వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్యపరమైన పరిష్కారం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌తో పాటు గల్ఫ్ తీరంలో భద్రత అంశంపై కూడా రాబోయే రోజుల్లో పరిష్కరం దొరికే అవకాశాలు ఉన్నట్లు మోదీ తెలిపారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

