న్యూఢిల్లీ: పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్ర ద్రౌపది ముర్మును కలుసుకుని దాడుల గురించి వివరించారు. మరోవైపు, ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ ధోవల్, రాజ్నాథ్ సింగ్తో ప్రధాని మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని వారు ప్రధాని మోదీకి తెలియజేసినట్టు సమాచారం. మరోవైపు, పాక్, నేపాల్ సరిహద్దు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. మన సరిహద్దులు, సైన్యం, ప్రజలను సవాల్ చేసినవారికి భారత దేశం దీటుగా సమాధానం చెప్పిందని అమిత్ షా ఈ సమావేశంలో చెప్పారు. ఉగ్రవాదుల స్థావరాలపై నిర్దిష్ట సమాచారంతో దాడి చేసినట్లు తెలిపారు.