PM Modi | న్యూఢిల్లీ: ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ విత్తన రకాలను దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు సంబంధించి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 61 రకాల పంటలకు సంబంధించి 109 రకాల విత్తనాలను అభివృద్ధి చేసింది.