PM Modi : దేశంలోని ఏడు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన క్యాబినెట్ కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు, ఏపీలో ఒక ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బిలాస్పూర్-కాంతి నగరాలను కలుపుతూ ఈ ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఇప్పటికే మూడు రైల్వే లైన్లు ఉన్న పలు ప్రాంతాల్లో నాలుగో లైన్ ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే రూ.2,000 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మరో 5,000 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయని, వీటికి ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. అలాగే, మరో 4,000 కిలోమీటర్ల మేర పనులకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేస్తున్నామన్నారు.
తెలంగాణకు సంబంధించి ఒక ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇది ఘట్కేసర్-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల పొడవైన నాలుగో లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీని విలువ రూ.2,419 కోట్లుగా ప్రభుత్వం నిర్ధరించింది. ఏపీకి సంబంధించి అరక్కోణం-రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3,4 లైన్ల నిర్మాణం జరగనుంది. మొత్తంగా దక్షిణాదికి సంబంధించి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం అంగీకరించింది.