– రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమరాగాని వెంకటేశ్వర్లు గౌడ్
– కామంచికల్లు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 09 : సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయం అని రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమరాగాని వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్లు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని బుధవారం సంగం పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోషించిన వీరోచిత పాత్రను పలువురు గౌడ సంఘం నాయకులు స్మరించుకున్నారు. 300 ఏళ్ల క్రితం బడుగు బలహీన వర్గాలను ఏకతాటి పైకి తీసుకువచ్చిన నాయకుడు పాపన్న గౌడ్ అన్నారు. అంతటి మహానీడి విగ్రహాన్ని గ్రామంలో ఆవిష్కరించుకోవడం హర్షనీయమన్నారు. గౌడ సంఘం నాయకులు ఐక్యతగా నిలిచి సమస్యల పరిష్కారానికి, సంఘం అభివృద్ధికి పాటుపడాలని దిశా నిర్దేశం చేశారు. సంఘం పెద్దలు బోడపట్ల వెంకన్న, డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్, ఊడుగు శ్రీనివాస్ గౌడ్, పోతగాని కృష్ణారావు, బండి నాగేష్, గండి రవి, అంతుల లక్ష్మీనారాయణ, గాడిపల్లి ఉపేందర్, పల్లె నరసింహారావు, వ్యాసారపు రాములు, బోయినపల్లి శ్రీను, మొక్క మల్లయ్య పాల్గొన్నారు.