Manipur | న్యూఢిల్లీ : మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నివేదిక మేరకు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ పరిధిలోకి అన్ని అధికారాలు తీసుకువస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇటీవలే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న బీజేపీ పాలిత మణిపూర్లో బీరేన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కనిపించినట్లు ఉంది.