న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం 71 మందికి ‘పద్మ’ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డీ నాగేశ్వర్ రెడ్డి ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని స్వీకరించారు.
నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ స్వీకరించారు. సుజుకి మోటార్స్ మాజీ చీఫ్ ఒసము సుజుకి, గాయకుడు దివంగత పంకజ్ ఉధాస్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీల తరపున వారి బంధుమిత్రులు ఈ పురస్కారాలను అందుకున్నారు. బాలీవుడ్ నటుడు శేఖర్ కపూర్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, హాకీ క్రీడాకారుడు పీఆర్ శ్రీజేశ్, వయొలిన్ విద్వాంసుడు లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు ద్రౌపది ముర్ము నుంచి పద్మ అవార్డులను స్వీకరించారు. మిగిలిన 69 మందికి త్వరలోనే మరో కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.