Jagdeep Dhankhar : భారత ఉపరాష్ట్రపతి (Vice president) జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) కు రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Naredra Modi) జన్మదిన శుభాకాంక్షలు (Birthday greetings) తెలిపారు. ధన్కడ్ చాలా ఏళ్లు దేశసేవ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కు జన్మదిన శుభకాంక్షలు. ఆయన కలకాలం ఆరోగ్యంగా ఉండి, చాలా ఏళ్లు దేవసేవ చేయాలి’ అని రాష్ట్రపతి ముర్ము ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
‘మన ఉపరాష్ట్రపతి ధన్కడ్కు జన్మదిన శుభాకాంక్షలు. కొన్నేళ్లపాటు పేరుమోసిన న్యాయవాదిగా పనిచేసిన ఆయనకు భారత రాజ్యంగంపై అపారమైన అవగాహన ఉంది. రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణలో ఆయన సమర్థంగా పనిచేస్తున్నారు. సమాజానికి సేవ చేయాలన్న ఆయన తపన గొప్పది. ఆయన కలకాలం ఆరోగ్యంగా జీవించాలి’ అని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు.
కాగా జగదీప్ ధన్కడ్ 1951 మే 18న రాజస్థాన్ రాష్ట్రం ఝున్ఝును జిల్లాలోని కితన గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం న్యాయవాద వృత్తిలో చేరి పేరుమోసిన న్యాయవాదిగా గుర్తింపు పొందారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా కూడా దన్కడ్ పనిచేశారు. ఆ తర్వాత 2022 ఆగస్టు 11న ఆయన భారత దేశానికి 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.