Ambedkar Jayanthi: అంబేద్కర్ 133వ జయంతి.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి
Ambedkar Jayanthi: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంట్ హౌజ్ లాన్లో నివాళి కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లు కూడా పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి(Ambedkar Jayanthi) సందర్భంగా ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. పార్లమెంట్ హౌజ్ లాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి.. ఆ కార్యక్రమానికి హాజరైన బౌద్ధ భిక్షువులకు కూడా పుష్పగుచ్ఛం సమర్పించారు. బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు.
#WATCH | Delhi: President Droupadi Murmu, pays tribute to Dr BR Ambedkar on the occasion of #AmbedkarJayanti2023 pic.twitter.com/VtWQLsXXAJ
— ANI (@ANI) April 14, 2023
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో పాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ముర్ము తన ట్విట్టర్లో సందేశం పోస్టు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | PM Narendra Modi pays tribute to Dr BR Ambedkar on the occasion of #AmbedkarJayanti in Delhi pic.twitter.com/fAxfXhPu19
— ANI (@ANI) April 14, 2023
జ్ఞానానికి, మేధస్సుకు అంబేద్కర్ ఓ సింబల్ అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. విద్యావేత్తగా, న్యాయ నిపుణుడిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా దేశ సంక్షేమం కోసం విపత్కరపరిస్థితుల్లోనూ పనిచేశారన్నారు. అణగారిన వర్గానికి విద్యను అందించి, వారిని ప్రధాన ప్రజాజీవన క్షేత్రంలోకి తీసుకురావాలని అంబేద్కర్ ప్రయత్నించినట్లు ముర్ము అన్నారు. ఆర్ధిక, సామాజిక సమానత్వం కోసం ఆయన కట్టుబడి ఉన్న తీరు అది ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తుందని ఆమె అన్నారు.
I extend my heartiest greetings and best wishes to all fellow citizens on the occasion of the birth anniversary of the architect of our Constitution, Babasaheb Bhimrao Ramji Ambedkar. pic.twitter.com/gQDjMxPGrL
— President of India (@rashtrapatibhvn) April 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

