న్యూఢిల్లీ : మేఘాలయ, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు సహజ సంపదను కలిగి ఉన్న రాష్ట్రాలు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాలు ఈశ్యాన్య ప్రాంతపు సంస్కృతి, విశిష్ట సంప్రదాయాలను సూచిస్తాయన్నారు.
మేఘాలయ, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలు భారతదేశ అభివృద్ధికి తమ శక్తి మేర సహకారం అందిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. 1972, జనవరి 21న మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
Greetings to the people of Manipur, Meghalaya and Tripura on Statehood Day. These states, full of natural riches, represent the vibrant culture and unique traditions of our northeast. My best wishes to the citizens of these states for a happy and prosperous future.
— President of India (@rashtrapatibhvn) January 21, 2022
Greetings to the people of Manipur, Meghalaya and Tripura on their Statehood Days. These states are making vibrant contributions to India’s development. Praying for their constant progress.
— Narendra Modi (@narendramodi) January 21, 2022