న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తారు. నూతనంగా ఆలయాన్ని నిర్మించిన తర్వాత తొలిసారిగా అయోధ్యకు వస్తున్న రాష్ట్రపతి.. బాల రాముడిని దర్శించుకుంటారు.
అంతేకాకుండా శ్రీ హనుమాన్ గర్హి ఆలయం, ప్రభు శ్రీరామ్ ఆలయం, కుబీర్ తీలలను దర్శించుకోవడంతో పాటు హారతి, సరయు పూజ వంటి కార్యక్రమాలలో పాల్గొంటారని రాష్ట్రపతి భవన్ తెలిపింది.