న్యూఢిల్లీ: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఉదయం లఢఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో గల కార్గిల్ యుద్ధస్మారకం వద్ద, ఢిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద పలువురు ప్రముఖులు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్, లఢఖ్ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నమ్గ్యాల్ కార్గిల్ యుద్ధస్మారకం దగ్గర పుష్పగుచ్ఛాన్నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు.
ఇక, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ జీ అశోక్‌కుమార్ తదితరులు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు సమర్పించారు. యుద్ధ స్మారకం దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద సీడీఎస్ బిపిన్ రావత్ విజయ జ్యోతిని వెలిగించారు.
Chief of Defence Staff (CDS) General Bipin Rawat, Ladakh Lieutenant Governor RK Mathur & Ladakh MP Jamyang Tsering Namgyal pay floral tribute at Kargil War Memorial in Dras on the occasion of #KargilVijayDiwas2021
— ANI (@ANI) July 26, 2021
CDS also installs victory flame at the memorial. pic.twitter.com/5hhfzuGtoF
Delhi: Defence Minister Rajnath Singh and Minister of State for Defence, Ajay Bhatt pay tribute at National War Memorial on the occasion of #KargilVijayDiwas2021 pic.twitter.com/rTjTOl6JMS
— ANI (@ANI) July 26, 2021