లాక్డౌన్కు సిద్ధం

- కాలుష్యంపై సుప్రీంకోర్టుకు ఢిల్లీ సర్కారు వెల్లడి
- ఏం చర్యలు తీసుకుంటారో నేటిలోగా తెలుపాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 15: ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై అత్యవసర సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అత్యావశ్యకం కాని నిర్మాణాలు, రవాణా, విద్యుత్తు ప్లాంట్ల నిలిపివేత, వర్క్ ఫ్రం హోం అమలు వంటి చర్యలపై మంగళవారంలోపు నిర్ణయం తీసుకోవాలని గడువు నిర్దేశించింది. కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడమేనన్న గగ్గోలుకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ కాలుష్యం అంశంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణను కొనసాగించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల కార్యదర్శులతో వెంటనే సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా సీజేఐ ఏడు చేపల కథను ఉటంకించారు. ఏడు చేపలలో ఒక చేప ఎండకపోవడానికి చెప్పిన సాకుల్లా ఢిల్లీ కాలుష్యానికి కారణాలను చెబుతున్నారని మండిపడ్డారు. సాకులు మాని కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే లాక్డౌన్ విధించడం, సరి-బేసి విధానం అమలు, లారీల ప్రవేశాన్ని నిషేధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి లాక్డౌన్ విధించడం వంటి చర్యలకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

