Pregnant Woman | లక్నో : తమ బిడ్డను ఏసీ వార్డులో డెలివరీ చేయించలేదనే కోపంతో.. వియ్యంకుడి కుటుంబంపై దాడి జరిగింది. ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బరాబంకికి చెందిన ఓ మహిళ నిండు గర్భిణి. ఆమెకు నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు భర్త, అత్తమామలు. అయితే ఆమెను ఆస్పత్రిలోని ఏసీ వార్డులో చేర్పించలేదు.
దీంతో గర్భిణి తల్లిదండ్రులు తమ కూతురిని ఎందుకు ఏసీ వార్డులో చేర్పించలేదని వియ్యంకుడి కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా ఇరు కుటుంబాలు దూషించుకుంటూ కొట్టుకున్నారు. ఈ తతంగాన్ని అక్కడున్న ఓ వ్యక్తి మొబైల్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
ఈ ఘటనపై గర్భిణి మామ రామ్‌కుమార్ మాట్లాడుతూ.. తమ కోడలికి నెలలు నిండడంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించాం. ఆమెను చూసేందుకు వారి తల్లిదండ్రులు వచ్చారు. ఏసీ వార్డులో ఎందుకు చేర్పించలేదని వాగ్వాదానికి దిగారు. తానే డబ్బులు కట్టి, చికిత్స ఇప్పించాను అని మామ రామ్ కుమార్ తెలిపాడు. అయినప్పటికీ తమపై దాడి చేశారని, తమ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#Barabanki
बहू के लिए अस्पताल में AC रूम न बुक करने पर मायके वालों ने की ससुराल पक्ष के लोगों की पिटाई, विडियो वायरल।आवास विकास कालोनी निवासी निवासी रामकुमार ने कोतवाली नगर में तहरीर देकर बताया की बहू की डिलीवरी सिविल लाइंस के एक निजी अस्पताल में करवाई गई थी, फैजुल्लागंज निवासी… pic.twitter.com/JmO8BwzRs8
— Barabanki News (@BBKNews) July 4, 2023