Pregnant woman dies | మహారాష్ట్ర (Maharashtra)లో విషాదం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో గుండెపోటుకు ( heart attack)గురై నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది (Pregnant woman dies). ఈ ఘటన పల్ఘర్ (Palghar) జిల్లాలో చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్రమ్గడ్ తాలూకాలోని గల్తారే గ్రామానికి చెందిన 31 ఏళ్ల కుంట వైభవ్ పడ్వాలే తొమ్మిది నెలల గర్భిణి. ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో జవహర్లోని ప్రభుత్వ ఆధ్వరంలో నడుస్తున్న పతంగ్షా కాటేజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డెలివరీ సమయంలో గుండెపోటుకుగురై గర్భిణి ప్రాణాలు కోల్పోయినట్లు సూపరింటెండెంట్ భరత్ మహాలే తెలిపారు. బేబీని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వెల్లడించారు.
Also Read..
Students Missing | నిజామాబాద్లో ముగ్గురు విద్యార్థినుల అదృష్యం..
Vande Bharat Sleeper | గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న వందే భారత్ స్లీపర్ రైలు.. వీడియో
Accident | శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి