Accident | శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి
హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన స్వాములను కొట్టాయం మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారని చెప్పారు.
హైదరాబాద్ పాతబస్తీ, మాదన్నపేట, ఉప్పర్ గూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రైవేటు బస్సులో శబరిమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎరుమెలి నుంచి పంపా నది వెళ్తుండగా.. నదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డులో మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. మూడు చెట్లపై ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మరణించగా, బస్సులో ఉన్న స్వాములు గాయాలతో బయటపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

