Pregnant teen | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమన్నందుకు ఏడు నెలల గర్భిణిని (Pregnant teen) బాయ్‌ఫ్రెండ్ (boyfriend) కడతేర్చాడు. అనంతరం యువతి మృతదేహాన్ని పూడ్చి పెట్టేశాడు. తన స్నేహితులో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వెస్ట్ ఢిల్లీలోని నాంగ్లోయ్ (Nangloi) ప్రాంతానికి చెందిన సోనీ అనే 19 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమెకు 6,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు సోషల్ మీడియాలో సంజు అలియాస్ సలీమ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసేవారు. ప్రస్తుతం సోనీ ఏడు నెలల గర్భవతి. దీంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ సోనీ తన బాయ్‌ఫ్రెండ్‌ను కోరింది. ఈ విషయంలో సంజు – సోనీ మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి.
అయితే, ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేని సంజూ.. ఎలాగైనా తనని వదిలించుకోవాలని భావించాడు. ప్రియురాలిని అంతం చేయాలని పథకం రచించాడు. ఇందుకు కర్వాచౌత్న ముహూర్తం పెట్టాడు. ఆ రోజు తన ఇద్దరు స్నేహితులు రితిక్, పంకజ్‌తో కలిసి కారులో నాంగ్లోయ్ ప్రాంతానికి వెళ్లారు. ఆ రోజు సోనీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను తీసుకొని ప్రియుడి వద్దకు వచ్చేసింది. అక్కడి నుంచి సోనీని వారు హర్యానాలోని రోహ్తక్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను గొంతు కోసి హతమార్చి.. రోహ్తక్ అడవుల్లో మృతదేహాన్ని పాతిపెట్టారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వచ్చేశారు. అక్టోబర్ 23న సోనీ కనిపించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సలీమ్, మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Railway Track | రైలు ప్రమాదానికి దారి తీసేలా మరో కుట్ర.. ట్రాక్‌పై ఆరు కిలోల బరువున్న చెక్క దిమ్మె
Samantha | ప్రేమ వివాహం చేసుకున్నాను.. కానీ,.. రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్
MS Dhoni | జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ