Railway Track | దేశంలో రైలు (Train) ప్రమాదాలకు దారి తీసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రాక్‌లపై (Railway Track) గ్యాస్ సిలిండర్లు, ఇనుప పట్టీలు ఉంచూతూ రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటివి అనేక ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మరో కుట్ర బయటపడింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మలిహాబాద్ రైల్వే స్టేషన్ (Malihabad Railway Station ) సమీపంలో ట్రాక్‌పై దుండగులు చెక్క దిమ్మెను (wooden block) ఉంచారు. అక్టోబర్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 14236 నంబర్ గల బరేలీ – వారణాసి ఎక్స్‌ప్రెస్ రైలు పైలట్ ట్రాక్‌పై ఉన్న 6 కిలోల కంటే ఎక్కువ బరువున్న రెండు అడుగుల పొడవైన చెక్క దిమ్మెను గుర్తించారు. వెంటనే అత్యవసర బ్రేక్‌లు వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో దాదాపు రెండు గంటల పాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు ట్రాక్‌పై ఉన్న వాటిని తొలగించారు. ఆ తర్వాత భద్రతా తనిఖీల అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇటీవలే దేశవ్యాప్తంగా రైళ్లను పట్టాలు తప్పించేందుకే అనేక కుట్రలు జరిగిన విషయం తెలిసిందే. రైలు ట్రాక్‌లపై వివిధ రకాల వస్తువులను అధికారులు గుర్తించారు. వీటిలో ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు, ఇసుక దిబ్బలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూడగా.. ఆ తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వివరించారు. ఇక జూన్ 2023 నుంచి ఇప్పటి వరకూ ఈ తరహా ఘటనలు 24 జరిగినట్లు తెలిపారు.
Also Read..
Samantha | ప్రేమ వివాహం చేసుకున్నాను.. కానీ,.. రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్
MS Dhoni | జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ
YCP | వైఎస్ కుటుంబ తగాదాలపై టీడీపీకి ఎందుకంత ఆసక్తి.. మండిపడ్డ వైసీపీ