Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతోపాటు నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ‘ఏమాయ చేశావే’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సామ్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక తొలి చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది. అయితే, క్యూట్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట నాలుగేళ్లకే తమ వివాహ బంధానికి స్వప్తి చెప్పేశారు. ప్రస్తుతం ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు.
అయితే, నాగచైతన్య మాత్రం సామ్‌తో విడిపోయిన తర్వాత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. మరో నటి శోభితతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో వివాహం కూడా చేసుకోబోతున్నారు. సమంత మాత్రం చైతూతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటోంది. ఇక పలు అనారోగ్య సమస్యల కారణంగా ఏడాదికాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అవుతోంది. తాను నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో ప్రేక్షకులన పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ ప్రొమోషన్స్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా సామ్‌కు ఓ విచిత్ర ప్రశ్న ఎదురైంది.
రెండో పెళ్లి గురించి ఓ విలేకరు సామ్‌ను ప్రశ్నించారు. దీనికి సమంత ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ‘నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను. కానీ ఇప్పుడు విడిపోయాను. ఇక జీవితంలో రెండో వివాహం గురించి నేను ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. సామ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు సమంతను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఈ సిరీస్‌లో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
Lawrence Bishnoi | జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు
MS Dhoni | జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ