Lawrence Bishnoi | లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi).. ఎవరి నోట విన్నా ఇదే మాట. ప్రస్తుతం అతను పంజాబ్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌కు వరుస హత్య బెదిరింపులు, బాబా సిద్ధిఖీ హత్య కేసు, జైల్లో ఉంటూనే టార్గెట్లను పూర్తి చేస్తుండటం వంటి కారణాలతో బిష్ణోయ్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.
అయితే, గతంలో ఈ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను జైల్లోనే కొందరు ఇంటర్వ్యూ (Interview In Jail) చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పంజాబ్ ప్రభుత్వం.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా చర్యలకు ఉపక్రమించింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న బిష్ణోయ్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతించిన పోలీసులపై పంజాబ్ హోం శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండ్‌కు గురైన వారిలో ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసులు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి గురుకీరత్ కిర్పాల్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 2022లో లారెన్స్ బిష్ణోయ్‌ను ఓ టీవీ ఛానెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలను సదరు టీవీ ఛానెల్ ప్రసారం కూడా చేసింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై హర్యానా హైకోర్టు విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం.. బిష్ణోయ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తించింది.
Also Read..
MS Dhoni | మరికొన్నేళ్లు ఆటను ఆస్వాదిస్తా.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ
MS Dhoni | జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ
Madhya Pradesh | భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్‌రేప్.. మధ్యప్రదేశ్‌లో నవ వధువుపై దారుణం