గువాహటి : అస్సాం శాసనసభ సమావేశాలు జరిగేటపుడు ప్రతి శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్ చేయడం కోసం సభ కార్యకలాపాలకు రెండు గంటలపాటు విరామం ఇచ్చే నిబంధనను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. రెండు గంటలపాటు ఇస్తున్న జుమ్మా విరామాన్ని రద్దు చేయడం ద్వారా వలస పాలన కాలంనాటి మరో అవశేషాన్ని వదిలించుకున్నామని, అస్సాం శాసనసభ ఉత్పాదకతకే ప్రాధాన్యమిచ్చిందని శర్మ శుక్రవారం తెలిపారు.