Prashanth Kishore : మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమధ్యే రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఓట్ల కదన రంగంలో దూకుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తాను సిద్ధంగా ఉన్నానని ప్రశాంత్ తెలిపారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానని చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుంది. అక్టోబర్ 9న పేర్లు వెల్లడిస్తాం. లిస్ట్ వచ్చాక మీరు ఆశ్చర్యపోతారు. నా పేరు కూడా ఆ జాబితాలో ఉంటుంది. సో మీరంతా.. అక్టోబర్ 9న రండి.. మళ్లీ కలుద్దాం’ అని ప్రశాంత్ తెలిపారు.
Prashant Kishor, founder of Jan Suraaj Party, was arrested today (Jan 6) in Patna while on a hunger strike demanding the cancellation of the BPSC exam.#PrashantKishor_BPSCProtest pic.twitter.com/zQJmlzAfOq
— Bihar_se_hai (@Bihar_se_hai) January 6, 2025
పార్టీ విజయావకాశాలపై అడిగిన ప్రశ్నకు ఆయన సానకూలంగా స్పందించారు. ఎన్డీఏ, ఇండియా కూటమికి ఓటు వేయని వాళ్లు తమకు మద్దతిస్తారని, తమ పార్టీకి 28 శాతం మంది ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు కూటములు కలిసి 72 శాతం ఓట్లు సాధించాయని.. మిగిలిన 28 శాతం ఓట్లు తమకు పడుతాయని నమ్ముతున్నట్టు ప్రశాంత్ చెప్పారు.
బీహార్లో ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్నూ వెల్లడించింది. రాష్ట్రంలో రెండు దఫాలో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. నవంబర్ 6న మొదటి దఫా, నవంబర్11న రెండో దఫా ఎన్నికలు ఉంటాయని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.