పాట్నా: ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాల కోసం బీహార్ ప్రజలు ఓట్లు వేయడం లేదని, అందుకే వారికి అవి లభించడం లేదని చెప్పారు. వీటిపట్ల వారికి అవగాహన కల్పించే ఉద్యమమే జన్ సురాజ్ అని వివరించారు.
పార్టీ సంస్థాగత ఎన్నికలు మార్చిలో జరుగుతాయని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. అప్పటి వరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని నియమిస్తున్నట్లు తెలిపారు.