తిరుమల: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున తన సతీమణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా, తిరుమలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. సర్వదర్శనానికి 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. మంగళవారం 67,192 మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకున్నారు. 20,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు సమకూరింది.
#WATCH | Jan Suraaj Party founder Prashant Kishor along with his wife offered prayers at Tirumala temple today morning pic.twitter.com/hQAduycFW2
— ANI (@ANI) February 12, 2025