పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయాన జన్ సురాజ్ పార్టీ నేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయనని ఆయన వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో 150 స్థానాల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన, అంతకు మించి తగ్గితే ఓటమిగానే పరిగణిస్తానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులకు సంబంధించి రెండు లిస్టులను విడుదల చేసింది. అయితే రెండింటిలోనూ ఆయన పేరు లేదు. పార్టీ ప్రయోజనాల కోసమే తానీ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.