Prashant Kishor | రాజకీయాల వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల నిర్వహించిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభానికి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీపీఎస్సీ పరీక్ష నిర్వహణలో పలు అవకతవకలు జరిగాయని తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నదని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వోద్యోగాల నియామకంలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు చర్య తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల నియామకంలో పారదర్శకత లోపించిందని, అధికార దుర్వినియోగం జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.