Prashant Kishor | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే జన్ సూరజ్ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న పార్టీని ప్రారంభించనున్నారు. జన్ సూరజ్ పార్టీ 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. 243 స్థానాల్లో పోటీ చేస్తుందని.. కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. 2030 నాటికి 70 నుంచి 80 మంది మహిళా నేతలను జన్ సూరజ్ నాయకురాళ్లుగా తీర్చిదిద్దుతామని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. మహిళా సెల్ సమావేశంపై ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. ఇది మహిళా సెల్ సమావేశం కాదని.. ఇది నిజమైన అర్థం మహిళా నాయకులను చేసే ప్రయత్నమన్నారు. మహిళలు జీవనోపాధికి నాలుగుశాతం గ్యారంటీతో రుణాలు పొందాలని.. అందుకే మహిళలను గెలిపించి అసెంబ్లీకి పంపుతామనేది జన్ సూరజ్ ప్రచారమన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం కొలువుదీరితే 10-12వేల ఉద్యోగాల కోసం బిహార్‌ను విడిచిపెట్టమిన ఎవరూ బలవంతం చేయరని.. ఇందుకోసం పూర్తిగా బ్లూప్రింట్‌ని సిద్ధం చేశామన్నారు. బిహార్ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ కులం, దోపిడీ, మద్యం మాఫీయా, నేరాలపై తేజస్వీ యాదవ్ కామెంట్స్ చేయవచ్చని.. అభివృద్ధిపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆయనకు జీడీపీ, జీడీపీ వృద్ధి అంటే ఏమిటో తెలియదని విమర్శించారు. ఆరు నెలల కిందట తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో బీహార్ అభివృద్ధి కథ గురించి ఆయన మాట్లాడుతున్నారు. మహాఘటబంధన్‌లో నితీశ్ కుమార్ ఉండి ఉంటే.. బిహార్‌లో ఆయనకు అంతా మంచే కనిపించేదంటూ సెటైర్లు వేశారు.