న్యూఢిల్లీ, జూలై 25: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని విద్యా శాఖ మంత్రిగా నియమించారు. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి.. ధర్మేంద్ర రాజీనామాను ఆమోదించారు. ఇది తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటించారు.
అంతేకాకుండా ప్రహ్లాద్ జోషి ఇప్పుడు నిర్వహిస్తున్న శాఖలకు అదనంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. కాగా, ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి విద్యా శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.