భోపాల్ : భారతీయ జనతా పార్టీ భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వార్తల్లోకెక్కారు. మొన్న బాస్కెట్ బాల్.. నిన్న డ్యాన్స్.. నేడు వ్యాక్సిన్ వివాదంలో ఇరుక్కుపోయారు ఎంపీ ప్రగ్యా. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రగ్యా ఠాకూర్ ఏ ఆస్పత్రికి వెళ్లలేదు. తన ఇంటికే ఆరోగ్య శాఖ సిబ్బందిని పిలిపించుకుని ప్రగ్యా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు ఆస్పత్రులకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రగ్యా ఠాకూర్‌కు ఏమైంది అని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
अभी कुछ दिन पूर्व ही बास्केट बॉल खेल रही व ढोल की थाप पर नृत्य कर रही हमारी भोपाल की सांसद प्रज्ञा ठाकुर ने आज घर टीम बुलाकर वैक्सीन का डोज़ लगवाया ?
— Narendra Saluja (@NarendraSaluja) July 14, 2021
मोदीजी से लेकर शिवराजजी व तमाम भाजपा नेता अस्पताल में जाकर वैक्सीन लगवा कर आये लेकिन हमारी सांसदजी को यह छूट क्यों व किस आधार पर? pic.twitter.com/QYEN4eNiV2