లక్నో: భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య ముక్కు, చెంపను భర్త గట్టిగా కొరికాడు. దీంతో భార్య ముక్కు, చెంపకు తీవ్ర గాయమైంది. డాక్టర్లు పది కుట్లు వేశారు. (man bites wife’s nose) ఆ మహిళ సోదరుడి ఫిర్యాదుతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. పానా అనే మహిళకు చాలా ఏళ్ల కిందట ఫూల్తో వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, ఇటీవల రాత్రి వేళ ఆ దంపతుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆగ్రహించిన ఫూల్ తన భార్య పానా ముక్కు, చెంపపై గట్టిగా కొరికాడు. దీంతో ఆమె ముక్కు పైభాగం తెగి ఊడిపోయింది. చెంపలపై లోతైన గాయాలయ్యాయి. ఈ దాడి తర్వాత ఇంటి నుంచి భర్త పారిపోయాడు.
మరోవైపు పానా కుటుంబ సభ్యులు తొలుత సమీపంలోని ఆసుపత్రికి ఆమెను తరలించారు. దీంతో ముక్కు, చెంప గాయాలకు డాక్టర్లు పది కుట్లు వేశారు. మెరుగైన చికిత్స కోసం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పానా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని అక్కడి డాక్టర్లు తెలిపారు. అయితే గాయాల తీవ్రత కారణంగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఆమెకు సూచించారు.
కాగా, పానా సోదరుడి ఫిర్యాదుతో ఆమె భర్త ఫూల్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడ్ని వెతికి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Illegal LPG Racket | అక్రమ ఎల్పీజీ గ్యాస్ దందా గుట్టురట్టు.. 45 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
Guests Assault Bride, Groom | పెళ్లిలో మద్యం ఇవ్వలేదని.. వధూవరులపై అతిథుల దాడి
Woman sacrificed daughter | కుమారుడి ఆరోగ్యం కోసం.. కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లి
Watch: ఒక ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళలు ఏం చేశారంటే?