పట్నా, ఆగస్టు 04: ఎన్డీయే పాలనలో ఉన్న బీహార్‌లో మౌలిక వసతుల కల్పన అత్యంత దయనీయంగా మారింది. కొద్ది రోజుల క్రితమే పట్నాలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఓ ఫ్లైఓవర్‌కు అప్పుడే గుంతలు ఏర్పడ్డాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల తాకిడికి ఫ్లైవర్ అప్పర్ డెక్‌లో కొంత భాగం నీట మునగటం..
బ్రిడ్జ్ నాణ్యత, భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్.. ఈ ఫ్లైఓవర్‌ను రూ.422 కోట్లు ఖర్చు చేసి నిర్మించగా, అప్పుడే గుంతలు పడటం ఏంటన్న చర్చ సాగుతున్నది. జూన్ 11న ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించగా, అప్పుడే గుంతలు పడటంతో ప్రభుత్వ అవినీతిపై విపక్షాలు విరుచుకుపడ్డాయి.