ముంబై, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పండర్ కావడ పట్టణంలో ఒక పోస్టుమ్యాన్ ఏడాది కాలంగా పౌరులకు వచ్చిన మూడు బస్తాల ఉత్తరాలు పంపిణీ చేయకుండా ఇంట్లో పెట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌మ్యాన్ పేరు సతీష్ ధుర్వే.
సీనియర్ న్యాయవాది ఘాజీ ఇబాదుల్లాఖాన్ తనకు ఏడాది నుంచి ఎలాంటి లేఖలు అందడం లేదని ఫిర్యాదు చేయడంతో అనుమానం వచ్చిన అధికారుల బృందం గురువారం ధుర్వే ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ బస్లాల్లో ఉన్న ఉత్తరాలు, పార్సిల్స్ చూసి షాక్ అయ్యారు. ఘటనపై దర్యాప్తు జరుగుతున్నది.