శ్రీనగర్, మే 13 : గత నెల పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ తెలియజేస్తే రూ.20 లక్షల బహుమతి ఇస్తామంటూ మంగళవారం అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పోస్టర్లు వెలిశాయి.
పహల్గాం దాడికి కారకులుగా భావిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హాల ఫొటోలతో పాటు ఉర్దూలో రాసిన ఈ పోస్టర్లలో వీరి గురించి సమాచారం, ఆచూకీ తెలియజేస్తే భారీ బహుమతి ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.