న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి, వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి తమ ప్రభుత్వం పాజిటివ్ కోణంలో ఆలోచిస్తున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. తమ పార్టీ అమలు చేయాల్సిన ఎజెండాల్లో ఆ రెండూ మిగిలి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే వీటి గురించి దేశ ప్రజలు సీరియస్‌గా ఆలోచిస్తున్నారన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వర్చువల్‌గా కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ వారిని టార్గెట్ చేసిందన్నారు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అనేక బీజేపీ మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆ రాష్ట్రాల్లో హింస అనేది రాజకీయ సంస్కృతిగా మారిందన్నారు. తమ మిషన్ ఇంకా కొనసాగుతోందని, ఉమ్మడి పౌరస్మృతితో పాటు వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి దేశంలో తీవ్ర చర్చ జరుగుతోందని, పాజిటివ్ కోణంలో ముందుకు వెళ్తున్నామన్నారు.
వన్ నేషనల్ వన్ ఎలక్షన్ కింద లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారు. ఇక యూసీసీ కింద ఏ మతస్థులవారైనా పెళ్లి, దత్తత లాంటి ఇతర అంశాల్లో అందరికీ ఒకే విధంగా చట్టాన్ని రూపొందించనున్నారు. ప్రతి సవాల్‌ను ఎదుర్కొనేందుకు బీజపీ కృషి చేస్తున్నట్లు ప్రజలు గుర్తించారని మోదీ అన్నారు. గతంలో పాజిటివ్ ఫలితాలు సాధించామని, భవిష్యత్తులోనూ పాజిటివ్ ఫలితాలు ఉంటాయన్నారు. బ్రిటీష్ కాలం నాటి వందల సంఖ్యలోని నల్ల చట్టాలను రద్దు చేశామని, ప్రజాస్వామ్య బద్దంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని, జనల్క్యాటగిరీలో పేదల పిల్లలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవర్ణ బిల్లు, అయోధ్యలో రామాలయ నిర్మాణం సంపూర్ణమయ్యాయి. బీజేపీ పార్టీ కార్యకర్తలు తమ స్వంత పార్టీని తల్లి తరహాలో చూసుకుంటారన్నారు. పార్టీ ఫౌండేషన్ డే అనేది రాజకీయ ఈవెంట్ కాదు అని, అది భావోద్వేగమైందన్నారు.