న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2010-2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ పదేళ్లలో ముస్లిం జనాభా 34.7 కోట్లు పెరిగింది. హిందువులు ప్రపంచ జనాభాలో 14.9 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు. మిగిలిన మతాల్లో పెరిగిన జన సంఖ్య మొత్తం కన్నా ముస్లిం జనాభా పెరుగుదల అధికంగా ఉంది.
క్రైస్తవం వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రపంచ జనాభాలో వీరి సంఖ్య తగ్గుతున్నది. 2010-2020 మధ్య వీరు 12.2 కోట్ల మంది పెరిగారు. అయినప్పటికీ, 230 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతి పెద్ద మతంగా క్రైస్తవం కొనసాగుతున్నది. ఏ మతంతోనూ సంబంధంలేనివారు ప్రపంచ జనాభాలో 24.2 శాతం ఉన్నారు. ప్రపంచ జనాభాలో 14.9 శాతంతో హిందువులు నాలుగో స్థానంలో ఉన్నారు. మధ్య ప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి వీరు వలస వెళ్లడంతో అక్కడ వీరి జనాభా 2010-2020 మధ్య 62 శాతం పెరిగింది.