న్యూఢిల్లీ: మధుమేహం, బీపీ మందులు, యాంటీ బయాటిక్స్, విటమిన్ సప్లిమెంట్లు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ వ్యవస్థలు గుర్తించాయి. సుమారు 185 ఔషధాలు ప్రామాణిక నాణ్యత లేనివి (ఎన్ఎస్క్యూ) అని వెల్లడించాయి. ప్రతి నెలా కొన్ని బ్యాచ్‌ల మందుల తనిఖీల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపాయి.
డెక్సామెథాసోన్ సోడియం ఫాస్పేట్ ఇంజెక్షన్ (యాంటీ బయాటిక్), అస్కోర్బిక్ యాసిడ్ ఇంజెక్షన్ (విటమిన్ సీ సప్లిమెంట్), అడ్రెనలైన్ బిటార్ట్రేట్ ఇంజెక్షన్, ఒండన్సెట్రాన్ ఇంజెక్షన్, జెంటామైసిన్ ఇంజెక్షన్ ఉన్నాయి. డైక్లోఫెనాక్ సోడియం ఇంజెక్షన్ వయల్‌లో కొన్ని లోపాలు కనిపించాయి. కొలెస్టిరమైన్, సోడియం పోలిస్టిరెన్ సల్ఫోనేట్లలో కూడా తేమ పరీక్షలో లోపాలు కనిపించాయి. ట్రానెక్సమిక్ యాసిడ్ ఇంజెక్షన్లో కూడా సమస్యలను గుర్తించారు.
హై బ్లడ్ షుగర్‌కు చికిత్స కోసం వాడే గ్లిపిజైడ్, మెట్ఫోర్మిన్ మాత్రలలో డిస్క్రిప్షన్ ఎర్రర్ కనిపించింది. కాల్షియం ఆస్పర్టేట్, కాల్షియంఒరోటేట్, కాల్సిట్రియోల్ మినరల్స్, విటమిన్ ట్యాబ్లెట్స్లలోని రెండు బ్యాచ్‌లు మూల్యాంకనలో విఫలమైనట్లు రెగ్యులేటరీ సంస్థలు ప్రకటించాయి. మార్టిన్ అండ్ బ్రౌన్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన కాల్షియం గ్లూకోనేట్ ఇంజెక్షన్లో పర్టిక్యులేట్ మ్యాటర్ ఉంది.
రబెప్రజోల్ సోడియం ఇంజెక్షన్ మూడు బ్యాచ్‌లలో పర్టిక్యులేట్ మ్యాటర్ ఉంది, ఈ.జీ. ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన విటమిన్ సీ ఇంజెక్షన్, విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్, నియాసినమైడ్ ఇంజెక్షన్లలోని రెండు బ్యాచుల్లో పర్టిక్యులేట్ మ్యాటర్, డిస్క్రిప్షన్ ఎర్రర్స్ ఉన్నాయి. టెల్మిసర్టన్ మాత్రల రెండు బ్యాచుల్లో డిజల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయి. రాష్ర్టాల ఔషధ నియంత్రణ వ్యవస్థలు గుర్తించిన ఔషధాల్లో డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్, సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్లలో స్టెరిలిటీ ఇష్యూస్‌ను గుర్తించారు.
మార్టిన్ అండ్ బ్రౌన్ బయోసైన్సెస్ తయారు చేసిన కాల్షియం, విటమిన్ డీ3 మాత్రల 13 బ్యాచుల్లో డిస్క్రిప్షన్ ఎర్రర్స్ కనిపించాయి. వివేక్ ఫార్మాకెమ్ తయారు చేసిన పారాసిటమాల్ ట్యాబ్లెట్స్‌లలో డిస్క్రిప్షన్ ఎర్రర్స్, సిప్రోఫ్లాక్సాసిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్లలో డిజల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయి. విటమిన్ బీ12 సప్లిమెంటేషన్ కోసం సేఫ్ కేర్ లైఫ్ సైన్సెస్ తయారు చేసిన మెకోబలమిన్ 2,500 ఎంజీ ఇంజెక్షన్లో కేవలం ఒక మిల్లీలీటరుకు 2.38 ఎంజీ మెకొబలమిన్ మాత్రమే ఉంది.