న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections) ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లని 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు. 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఉవ్విళ్లూరుతుండగా, 25 ఏండ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారా మిలటరీ దళాలు, 35 వేల మంది ఢిల్లీ పోలీసులు, 19 వేల మంది హోంగార్డులను పోలింగ్ భద్రత కోసం వినియోగిస్తున్నారు.
#WATCH | #DelhiElection2025 | Congress candidate from Kalkaji assembly seat Alka Lamba and her father Amar Nath Lamba arrive at a polling station in Madipur to cast their vote.
Voting process has halted here due to some glitch in VVPAT. pic.twitter.com/CTYoBsgpy5
— ANI (@ANI) February 5, 2025