Squid Game | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ (Squid Game). హ్వాంగ్ డాగ్ హ్యూక్ దర్శకత్వంలో వచ్చిన ఈ కొరియన్ సిరీస్‌లో డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను ఆసక్తికరంగా చూపించారు. ఆటలు ఆడేందుకు వచ్చిన 456 మందిని ఒక దీవికి తీసుకువెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహిస్తారు. ఇందులో నటించిన వాళ్లంతా గ్రీన్ డ్రెస్సులు ధరించి కనిపిస్తారు. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ‘స్క్విడ్ గేమ్’లో ఇండియన్ సినీ స్టార్స్ పాల్గొంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ గేమ్‌లో పొలిటికల్ లీడర్స్ (political leaders) పాల్గొన్న వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జై శంకర్, ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలు గ్రీన్ డ్రెస్‌లు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరైనట్లు వీడియోను సృష్టించారు. అదేవిధంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బ్లాక్ డ్రెస్‌లో సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఏఐ ఆధారంగా సృష్టించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
Player number 1 and 456 together 🤪
Meanwhile, wait for the frontman at the end in #black 🤪All players on chess board 🛹..#SquidGames #SquidGame3#TheTraitors #CaliforniaWildfires#JHOPE #SquidGames #SquidGame #SquidGame5Star #SquidGameSeason2 #SquidGame5Star #jhope_TOUR pic.twitter.com/hBOgEprB36
— Aruna Janghu (@ArunaaJanghu) January 10, 2025
కాగా, ఈ ఫ్రాంచైజ్ నుంచి 2021లో సీజన్ 1 రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. ఇక గతేడాది డిసెంబర్లో ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీజన్ 1 కథ విషయానికి వస్తే.. జీవితంలో సర్వస్వం కోల్పోయిన 456 మందిని ఒక దీవికి తీసుకువెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహిస్తారు. మొత్తం ఆరు గేమ్స్ ఉన్న ఇందులో ఫస్ట్ గేమ్ గెలిచిన వారు సెకండ్ రౌండ్లోకి ఆ తర్వాత చివరగా వచ్చేవారికి ‘స్క్విడ్ గేమ్’ నిర్వహిస్తారు. అయితే ఫైనల్‌గా వచ్చేవాళ్లు మొత్తం డబ్బు గెలుచుకోవచ్చు. ఇక మొదటిరౌండ్ నుంచే ఎలిమినేషన్ అయిన వారిని నిర్వహాకులు చంపేస్తూ ఉంటారు. చూడడానికి చిన్నపిల్లల ఆటలు లాగ ఉన్న మొత్తం వయొలెన్స్ కనిపిస్తుంటుంది.
ఈ సీజన్ 2 కథ విషయానికి వస్తే.. స్క్విడ్ గేమ్ రెండో సీజన్ ఆట ప్రారంభమవుతుంది. ఇందులో స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ గెలిచిన అనంతరం అందులో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ప్లేయర్ 456 (గి-హన్) కనిపెట్టాలని చూస్తాడు. ఈ క్రమంలోనే అతడికి జరిగిన సంఘటనలు ఏంటి. గి-హన్ మళ్లీ స్క్విడ్ గేమ్ ఎందుకు ఆడడానికి వెళ్లాడు అనేది తెలియాలంటే సీజన్ 2 చూడాల్సిందే.
Also Read..
“Squid Game | ‘స్క్విడ్ గేమ్’లో స్టార్ హీరోలు..! వీడియో చూశారా..?”
“Upcoming Movies 2024 | ఈ ఏడాది థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే”
“Squid Game S2 | ‘స్క్విడ్ గేమ్ ’ సీజన్ 2 తెలుగు టీజర్ రిలీజ్”