OTT Releases This Week | పుష్ప సినిమాతో డిసెంబర్లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్‌తో గత వారం నాలుగు సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లితో పాటు విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, ఉపేంద్ర ‘UI’, ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వసుళ్లను రాబడుతున్నాయి. అయితే మరో వారం రోజుల్లో కొత్త ఏడాది రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు రాబోతున్నాయి. ఇదిలావుంటే ఈ ఏడాది చివరి వారంలో వినోదాల విందును పంచడానికి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అటు థియేటర్‌తో పాటు ఇటు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక ఆ చిత్రాలేంటో ఒకసారి చూసుకుంటే..
మోహన్‌లాల్ బరోజ్
Barroz
మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ.. స్వీయ దర్వకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం బరోజ్ (Barroz). ఆంటోనీ పెరుంబవూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్’ అనే నవలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్కోడిగామాలో దాగి ఉన్న రహస్య నిధికి బరోజ్ అనే మాంత్రికుడు రక్షకుడు. అయితే ఆ నిధిని అసలైన వారసుడికి బరోజ్ ఎలా అందించాడు అనేది ఈ సినిమా కథ.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
టాలీవుడ్ నటులు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాద్యాసం ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’(
Srikakulam Sherlock Homes
Homles). శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల కిషోర్‌లో ఇందులో డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
బేబి జాన్
Baby John
తమిళ దర్శకుడు అట్లీ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం బేబి జాన్ (Baby John). విజయ్ తేరి సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కథానాయకుడిగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ (Keerthy Suresh), వామిక గబ్బి(Wamika Gabbi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన కీర్తి సురేశ్ తొలిసారి బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది.
‘మాక్స్’
Max
ఈగ ఫేం కన్నడ నటుడు సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాక్స్’. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడలో డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తెలుగులో డిసెంబర్ 27న రాబోతుంది. సుదీప్ ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. సస్పెండ్ అయిన పోలీస్ అధికారి అర్జున్ రెండు నెలల తర్వాత విధుల్లోకి హాజరు అయిన అనంతరం ఒక మిస్టరీ కేసు వస్తుంది. ఈ కేసును అతడు ఎలా చేధించాడు అనేది ఈ సినిమా స్టోరీ.
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
ఆహా
ఆన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో విక్టరీ వెంకటేశ్ (డిసెంబర్ 27)
నెట్‌ఫ్లిక్స్
Squid Game Season 2
స్క్విడ్ గేమ్ 2 (కొరియన్ వెబ్ సిరీస్) డిసెంబర్ 26
సార్గవాసల్ (తమిళం) డిసెంబరు 27
ది ఫోర్జ్ (హాలీవుడ్) డిసెంబరు 22
ఓరిజిన్ (హాలీవుడ్) డిసెంబరు 25
భూల్ భూలయ్య3 (హిందీ) డిసెంబరు 27
సార్గవాసల్ (తమిళం) డిసెంబరు 27
డిస్నీప్లస్ హాట్‌స్టార్
వాట్ ఇఫ్..? 3 (యానిమేషన్ సిరీస్) డిసెంబరు 22
డాక్టర్ వూ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 26
అమెజాన్ ప్రైమ్ వీడియో
సింగం అగైన్ (హిందీ) డిసెంబరు 27
థానర (మలయాళం) డిసెంబరు 27
జియో సినిమా
డాక్టర్స్ (హిందీ సిరీస్) డిసెంబరు 27
జీ5
ఖోజ్ (హిందీ) డిసెంబరు 27