Squid Game S2 | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ మళ్లీ వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి 2021లో సీజన్ 1 రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. కాగా.. ప్రస్తుతం స్క్విడ్ గేమ్ సీజన్ 2 రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.
సీజన్ 1 కథ విషయానికి వస్తే.. జీవితంలో సర్వస్వం కోల్పోయిన 456 మందిని ఒక దీవికి తీసుకువెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహిస్తారు. మొత్తం ఆరు గేమ్స్ ఉన్న ఇందులో ఫస్ట్ గేమ్ గెలిచిన వారు సెకండ్ రౌండ్లోకి ఆ తర్వాత చివరగా వచ్చేవారికి ‘స్క్విడ్ గేమ్’ నిర్వహిస్తారు. అయితే ఫైనల్‌గా వచ్చేవాళ్లు మొత్తం డబ్బు గెలుచుకోవచ్చు. ఇక మొదటిరౌండ్ నుంచే ఎలిమినేషన్ అయిన వారిని నిర్వహాకులు చంపేస్తూ ఉంటారు. చూడడానికి చిన్నపిల్లల ఆటలు లాగ ఉన్న మొత్తం వయొలెన్స్ కనిపిస్తుంటుంది.
ఈ సీజన్ 2 కథ విషయానికి వస్తే.. స్క్విడ్ గేమ్ రెండో సీజన్ ఆట ప్రారంభమవుతుంది. ఇందులో స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ గెలిచిన అనంతరం అందులో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ప్లేయర్ 456 (గి-హన్) కనిపెట్టాలని చూస్తాడు. ఈ క్రమంలోనే అతడికి జరిగిన సంఘటనలు ఏంటి. గి-హన్ మళ్లీ స్క్విడ్ గేమ్ ఎందుకు ఆడడానికి వెళ్లాడు అనేది తెలియాలంటే సీజన్ 2 వచ్చేవరకు ఆగాల్సిందే.