Squid Game | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ (Squid Game). ఈ కొరియన్ వెబ్‌సిరీస్ ఇప్పటికే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్వాంగ్ డాగ్ హ్యూక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్‌లో డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను ఆసక్తికరంగా చూపించారు. ఆటలు ఆడేందుకు వచ్చిన 456 మందిని ఒక దీవికి తీసుకువెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహిస్తారు. అక్కడ వారంతా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశం ఆధారంగా వచ్చిన ఈ సిరీస్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే, ఈ ‘స్క్విడ్ గేమ్’లో ఇండియన్ సినీ స్టార్స్ పాల్గొంటే ఎలా ఉంటుంది..? ఈ ఆలోచనతోనే ఓ నెటిజన్ ఏఐ సాయంతో వీడియోను రూపొందించారు. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, దళపతి విజయ్, రజినీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, మోహన్‌లాల్, నాగార్జున, నాగచైతన్య, సూర్య, మహేశ్‌బాబు, ధనుష్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కల్యాణ్, అజిత్, యష్, రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, రానా, హృతిక్ రోషణ్ తదితరులు ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌లోని ఆటగాళ్ల దుస్తుల్లో కనిపించారు. ‘స్క్విడ్ గేమ్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
This is INSANELY good! AI just outdid itself! 👏🔥#AI #SquidGame #ArtificialIntelligence #MachineLearning #GenAI pic.twitter.com/gkrZ65wTJs
— 𝐍𝐚𝐠𝐞𝐬𝐡 𝐏𝐨𝐥𝐮 (@nageshpolu) January 7, 2025
కాగా, ఈ ఫ్రాంచైజ్ నుంచి 2021లో సీజన్ 1 రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. ఇక గతేడాది డిసెంబర్లో ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీజన్ 1 కథ విషయానికి వస్తే.. జీవితంలో సర్వస్వం కోల్పోయిన 456 మందిని ఒక దీవికి తీసుకువెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహిస్తారు. మొత్తం ఆరు గేమ్స్ ఉన్న ఇందులో ఫస్ట్ గేమ్ గెలిచిన వారు సెకండ్ రౌండ్లోకి ఆ తర్వాత చివరగా వచ్చేవారికి ‘స్క్విడ్ గేమ్’ నిర్వహిస్తారు. అయితే ఫైనల్‌గా వచ్చేవాళ్లు మొత్తం డబ్బు గెలుచుకోవచ్చు. ఇక మొదటిరౌండ్ నుంచే ఎలిమినేషన్ అయిన వారిని నిర్వహాకులు చంపేస్తూ ఉంటారు. చూడడానికి చిన్నపిల్లల ఆటలు లాగ ఉన్న మొత్తం వయొలెన్స్ కనిపిస్తుంటుంది.
ఈ సీజన్ 2 కథ విషయానికి వస్తే.. స్క్విడ్ గేమ్ రెండో సీజన్ ఆట ప్రారంభమవుతుంది. ఇందులో స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ గెలిచిన అనంతరం అందులో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ప్లేయర్ 456 (గి-హన్) కనిపెట్టాలని చూస్తాడు. ఈ క్రమంలోనే అతడికి జరిగిన సంఘటనలు ఏంటి. గి-హన్ మళ్లీ స్క్విడ్ గేమ్ ఎందుకు ఆడడానికి వెళ్లాడు అనేది తెలియాలంటే సీజన్ 2 చూడాల్సిందే.
Also Read..
Allu Arjun | శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.. వీడియో