Lashkar Terrorist Arrest : ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆదివారం అరెస్టయిన లష్కరే ఉగ్రసంస్ధ సభ్యుడు రియాజ్ అహ్మద్‌ను రిటైర్డ్ సైనికోద్యోగిగా గుర్తించారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎల్ఈటీ మాడ్యూల్‌ను కశ్మీర్ పోలీసులు భగ్నం చేసిన కొద్దిరోజుల అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
రియాజ్ అహ్మద్ వాస్తవాధీన రేఖ వెంబడి నుంచి ఆయుధాలను సేకరించేందుకు ఖుర్షీద్ అహ్మద్, గులాం సర్వర్లతో కలిసి భారీ కుట్రకు తెరలేపాడని పోలీసులు తెలిపారు. జమ్ము కశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు ఆయుధాలను సేకరించే క్రమంలో వీరు కుట్ర పన్నారని చెప్పారు.
కాగా, అంతకుముందు జమ్ము కశ్మీర్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఆయుధ సామాగ్రిని స్మగ్లింగ్ చేస్తూ పలువురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో జహూర్ అహ్మద్ భట్ నుంచి పోలీసులు ఏకే సిరీస్ రైఫిల్, మ్యాగజీన్స్, రౌండ్స్, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
Read More :
Airtel | వినియోగదారులకు ఎయిర్టెల్ షాక్.. భారీగా పెరగనున్న టారిఫ్‌లు!